BRS నేతలపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.మాజీ మంత్రి కేటీఆర్ అధికారం పోయిందనే బాధలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వద్దంటూ సంకల్ప దీక్షలు చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన 11 నెలల్లోనే రాష్ట్రాన్ని అల్లాదీన్ అద్భుత ద్వీపంలా ఎలా చేస్తారో వివరించాలని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు.