నీట్ పేపర్ లీకేజీపై బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పుయాదవ్ లోక్ సభలో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన 'రీనీత్' టీ-షర్ట్ ధరించారు. 'నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని విమర్శించారు. దీనికి సభలో ఉన్న కేంద్రమంత్రులు అభ్యంతరం చెప్పగా ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. ‘మీరు ఎంతమంది ఉన్నా నేను ఒక్కడినే పోరాడతా. స్వతంత్రంగా గెలుస్తున్న నాకు మీరు చెబుతున్నారా?’ అని కౌంటర్ ఇచ్చారు.