ప్రధాని మోడీకి థాంక్స్‌ చెప్పిన నాగార్జున.. ఎందుకంటే?

ప్రధాని మోడీకి సోషల్‌ మీడియా వేదికగా హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. 'అక్కినేని.. తెలుగు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారు' అని అన్నారు. దీంతో 'ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏఎన్నార్‌‌ను ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్‌ దూరదృష్టి, ఇండియన్‌ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి' అని నాగార్జున పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్