నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ 4గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 32, 360 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు . ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 76, 656 క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో 76, 656 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589. 90 అడుగులుగా ఉందని అధికారులు గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్