నల్గొండ జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ పునరావాస కేంద్రాల పనులకు సంబంధించిన పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకుని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలు భూ సేకరణ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీటిని వేగవంతం చేయాలని తెలిపారు.