ఇటీవల సంచలనం కలిగించిన ‘డీప్‌ఫేక్’ వ్యవహారంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజానికి, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్న డీప్‌ఫేక్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై ఎన్నికల తర్వాత నిబంధనలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిని అరికట్టేందుకు చట్టంలో కొత్త నిబంధనలు లేదా అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.