ప్రజలు ఇంటి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆదిలాబాద్ జిల్లా డిఆర్డిఏ అధికారి సాయన్న కోరారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని ధనోర బి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించి పంచాయతీ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఇళ్ల పరిసరాలలో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.