ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి కలెక్టర్ అభిలాష అభినవ్, జాయింట్ కలెక్టర్, తదితర ప్రముఖులు అవార్డులను అందజేశారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎం స్వాతి, కడెం మండలంలో లైన్మెన్ గా పనిచేస్తున్న సంతోష్, పెంబి మండలం యాపల్గుడ గ్రామ కార్యదర్శి రాజు అవార్డులను అందుకున్నారు.