బాసర అమ్మవారిని దర్శించుకున్న డిఈఓ

నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి
శుక్రవారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో ఆశీస్సులు అందించారు. ఉత్తమ విద్యా శాఖ అధికారిగా అవార్డ్ అందుకున్నందుకు ఉపాధ్యాయులు కొక్కుల గంగాధర్, సిఆర్పి మహేష్ ఆయనను షాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు స్థానిక ఉపాద్యాయులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్