నిజామాబాద్ జిల్లా మోపాల్ ప్రెసిడెన్సి హై స్కూల్ లో జిల్లా స్థాయి బాలోత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లోని నైపుణ్యతను తల్లిదండ్రులు గుర్తించి వారిని ప్రోత్సహించాలని రూరల్ MLA భూపతి రెడ్డి పిలుపునిచ్చారు.