నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో అడవిమామిడిపల్లి వద్ద ఆర్యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అందువల్ల ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్-3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వచ్చే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించబడిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.