వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు

వైసీపీ కేంద్ర కార్యాలయానికి బుధవారం ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి ఆ నోటీసులను అంటించారు. 2021 అక్టోబర్‌ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. ఆ రోజున వైసీపీ కేంద్ర కార్యాలయ సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని పోలీసులు ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు ప్రస్తుతం ముమ్మరం చేశారు. దీనిపై వైసీపీ ఇంకా స్పందించలేదు.

సంబంధిత పోస్ట్