‘కాళేశ్వరం’ లేకున్నా వరి దిగుబడి పెరిగింది: CM రేవంత్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. దీంతో కాళేశ్వరం వల్లే వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ ప్రచారం పటాపంచలైందన్నారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమని అన్నారు. అత్యధిక దిగుబడి ఘనత సాధించేందుకు కారణమైన ప్రతి రైతుకు సీఎం అభినందనలు తెలుపుతూ ‘X’లో పోస్టు చేశారు.

సంబంధిత పోస్ట్