తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని పర్యటించిన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఈ సమయంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను కేంద్ర మంత్రి పదవిలో ఉన్నానని, బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు లేవని తెలిపారు. దీంతో తదుపరి బీజేపీ అధ్యక్షుడి అధిష్టానం ఎవరిని ఎంపిక చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది.