ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు

ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దైంది. ఈ నెల 29న జరగాల్సిన మోదీ పర్యటన తుఫాను హెచ్చరికల కారణంగా రద్దైనట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపన, కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. అలాగే ఏయూ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్