ఆమనగల్లు: కల్వకుర్తిని అంధత్వ నివారణగా తీర్చిదిద్దుతా

కల్వకుర్తి నియోజకవర్గంను అంధత్వ నివారణ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి చెప్పారు. శనివారం ఆమనగల్లులో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదో రోజు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో సేవలు అందించేందుకు ఫౌండేషన్ ముందుకు సాగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్