వచ్చే నెల ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ నగరం లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం జరిగే వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని అధికారులకు సీఎం సూచించారు.