దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట సిద్దుల చంద్రం కుమారుడు రాకేష్ మృతి చెందాడు. శనివారం వారి కుటుంబానికి డిసిసిబి డైరెక్టర్ పూస దశరథం, మాజీ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ. 6 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పెంబర్తి బాలకిషన్, కొట్టె స్వామి, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లచ్చ పేట లక్ష్మి, స్వామి, పొన్నాల యాదగిరి, రమేష్, ముత్తగౌడ్, పాల్గొన్నారు.