దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో దాతల సహకారంతో ఆదివారం నిరుపేద యువతి వివాహం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దూదేకుల హమీద్ పేదరికంతో పోట్టకూటికోసం కోసం చిన్న పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూతురు వివాహం చేయడం తలకు మించిన భారంగా ఉందని తల్లిదండ్రులు ఎస్ఆర్ ఫౌండేషన్ ను సంప్రదించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో యువతి వివాహం చేయడం జరిగిందన్నారు.