క్రీడలు ఉపయోగకరంగా ఉంటాయి

విద్యార్థులకు విద్యతో పాటు మానసికోల్లాసం, శారీరక ఎదుగదల ఎంతో అవసరమని ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు, జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింలు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో జిల్లా యువజన సంక్షేమ మరియు క్రీడల శాఖ సహకారంతో అథిలేటిక్స్ ఉచిత వేసవి క్రీడా శిబిరంను ఆయన సందర్శించి మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్