హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రల కిరణ్ హెచ్చరిక

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులకు ఆయన బుదవారం పోలీస్ స్టేషన్ ఎదుట కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి. ఐ. కిరణ్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనం నడిపేవారు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని తెలిపారు. తాగి వాహనం నడపడం వల్ల దేశంలో సంవత్సరానికి లక్ష 50 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మద్యం మత్తులో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్