సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గండిపల్లి నుంచి డెక్యానాయక్ తండా మీదుగా సరిరాం తండా వరకు గత 50 ఏళ్లుగా మట్టి రోడ్డు ఉండడం వలన నరకయాతన అనుభవించామని అక్కడి వారు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో మాకు బిటి రోడ్డు నిర్మాణం అయ్యిందని తండా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు రుణపడి ఉంటామని తెలిపారు.