జగిత్యాల పట్టణం ఇందిరానగర్ కు చెందిన బిజేపీ కార్యకర్త మామిడి భాస్కర్ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను ముదిగంటి రవీందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించినారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబనికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. వారి వెంట నారాపక అశోక్ , వరికొప్పుల గణేష్, కూర్మచలం సతీష్, నాగరాజు, స్వామి , నర్సయ్య, తదితరులు ఉన్నారు.