ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో విఫలం

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికార పార్టీ రెండు కూడా రైతులను విస్మరిస్తూ రాజకీయ డ్రామాలకు తెర లేపాలని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని అరెపల్లి గ్రామంలో శుక్రవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన చూపిస్తున్న ప్రేమ రైతులు పడుతున్న కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్