రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు సన్న వరి ధాన్యం విక్రయించి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బోనస్ ను పొందాలని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం యమపూర్ సహకార సంఘ చైర్మన్ అంకతి రాజన్న అన్నారు. సోమవారం మండలంలోని వేములకుర్తి గ్రామంలో సహకార సంఘ వరి ధాన్యం కోనుగోలు కేంద్రంను రైతులు, స్దానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేశేట్టీ రాజరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.