జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకు వస్తున్న భూ భారతితో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం కాక లక్షలాది ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు.