నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సీపెల్లి రవీందర్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల స్థూపం వద్ద బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామనపెల్లి వెంకటస్వామి, మహంకాళి సురేష్, బొంకూరి సాగర్, కుక్క అన్వేష్, బొంకూరి శంకర్, సలిగంటి రాజేందర్ పాల్గొన్నారు.