హిందువులలో ఐక్యత పెరగాలి

హిందువులలో ఐక్యత పెరగాలని పెద్దపల్లి జిల్లా పురోహిత సంఘం అధ్యక్షులు కొండపాక శ్రీనివాస్ చారి అన్నారు. శనివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయం ముందు సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ చేపట్టిన దీక్షను సందర్శించారు. సాక్షాత్తు కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేసిన వారిని శిక్షించాలని పురోహితులు శ్రీనివాసచారి, శ్రావణ్ శర్మ, రమేష్ శర్మ, శంకరశర్మలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్