లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన అధ్యక్షులు మానువాడ శంకర్ తన సొంత ఖర్చులతో చీర్లవంచ, అనుపురం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, అనుపురం మధ్యాహ్న భోజన కార్మికులకు జూట్ బ్యాగులు శనివారం పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించుటకు ఈ బ్యాగులను ఉపయోగించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా అందరూ తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.