కర్ణాటక రాజధాని బెంగళూరు కుంబల్‌గోడులోని ఏసీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి.. కాలేజీ వాష్‌రూమ్‌లో ఉన్న అమ్మాయిల వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడు. కాగా, దీనిని గుర్తించిన విద్యార్థులు శనివారం ఆ కాలేజీ వద్ద భారీగా నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నిందితుడైన ఏడో సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు.