తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048) బియ్యానికి దేశ, విదేశాల్లో బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు పౌర సరఫరాల సంస్థ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర అవసరాలు పోను సుమారు నాలుగైదు లక్షల సన్న బియ్యం మిగిలే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. మిగులు బియ్యాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఫిలిప్పీన్స్, ఇతర దేశాలకు మంచి ధరకు విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.