తాజాగా భోజ్‌పురి నటి నిషా దూబే కీలక విషయాన్ని వెల్లడించింది. తాను ఓ కేంద్రమంత్రిని ప్రేమిస్తున్నట్లు చెప్పేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసిన నిషా దూబే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్‌పై తాను మనసు పారేసుకున్నట్లు తాజాగా తెలిపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. చిరాగ్ పాశ్వాన్ పేరు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.