పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది

మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ప్రాజెక్టులు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నాయి. ఇంకా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.65 టీఎంసీలకు ప్రస్తుతం 8.10 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో జూరాల నుంచి వరదను దిగువను విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్