చిన్నారికి గుండె ఆపరేషన్ చేపించి, మానవత్వాన్ని చాటుకున్న జనసేన ఎమ్మెల్యే

పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిడమర్రు మండలానికి చెందిన బొంగా సురేష్, జ్యోత్స్న దంపతుల నెల బిడ్డకు గుండెకు రంధ్రం ఉండి అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆపరేషన్ చేయకుంటే బిడ్డకు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పడంతో, ఆ తల్లిదండ్రులు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు భరించి, తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో బిడ్డకు చికిత్స అందించి, ప్రాణాలు కాపాడారు.

సంబంధిత పోస్ట్