ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. SUV కారు రాపిడో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి కారు, బైక్ రెండు దగ్ధమయ్యాయి. ఆదివారం తె.జా ఝండేవాలన్ ప్రాంతంలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్‌యూవీ డ్రైవర్ ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్‌సి మీనాగా గుర్తించారు. ఈ ఘటనలో రాపిడో బైక్ నడుపుతున్న యువకుడికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసి మీనాను అదుపులోకి తీసుకున్నారు.