AP: పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 25 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు.. పెంటపాడు మండలం ముదునూరు వద్ద అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో లేడీ కండక్టర్‌తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలు అయ్యాయి. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.