రోజూ 5 - 6 బొప్పాయి గింజలను పొడి చేసుకొని పాలు, గంజి వంటి వాటితో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గింజల్లో ఉండే పాలీఫెనాల్స్ శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. మహిళలు బొప్పాయి గింజల పొడి తీసుకుంటే పీరియడ్స్ సమస్యలు దూరం అవుతాయి. ఈ పొడి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.