VIDEO: విశాఖలో 400 మీటర్లు వెనక్కి వెళ్ళిన సముద్రం.. బయటపడ్డ రాళ్లతో ఫొటోలు దిగుతున్న జనం

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం సుమారు 400 మీటర్లు వెనక్కి వెళ్ళింది. శనివారం సాయంత్రం సముద్రం వెనక్కి వెళ్లడంతో తీరంలో భారీగా రాళ్లు బయటపడ్డాయి. వాటిపైకి చేరి ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ విశాఖలో సముద్రం వెనక్కి వెళ్లింది. అయితే సముద్ర కదలికలు గమనించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్