వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లోని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్స్ హరి ప్రసాద్, మహేందర్ రాజు చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అలాగే ఏఎన్ఎం లకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన న్యూట్రిషన్ కిట్లను గర్భిణీ స్త్రీలు వినియోగించుకోవాలని కోరారు. దీని ద్వారా సమయానుకూలంగా గర్భిణీ స్త్రీలకు పోషకాహారం లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ గోవింద్, రుద్రారం సర్పంచ్ దామోదర్ రెడ్డి, అంగర్ రాయచూరు పి హెచ్ సి సూపర్వైజర్ సుశీల , మధుసూదన్ రెడ్డి పి హెచ్ ఎన్ విజయ రాణి , ల్యాబ్ టెక్నీషియన్ మహేష్ ఫార్మసిస్ట్ నవీన్, ఏఎన్ఎమ్స్ చంద్రకళ అనంతలక్ష్మి అనురాధ మానెమ్మ జయమాల రాములమ్మ శైలజ తో పాటు ఆశ కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.