బొంరస్ పేట మండల కేంద్రానికి సమీపంలోని బురాన్పూర్, ముద్దాయి పేటకు వెళ్లే రోడ్డులో ఏఎస్ఐ రాములు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని, తప్పనిసరిగా వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ నర్సింలు, కిషన్ ఉన్నారు.