నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరియు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరిగే సదర్ వేడుకలకు నారాయణపేట జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆదివారం డాక్టర్ పూర్ణచంద్ర యాదవ్ కోరారు. ఈ కార్యక్రమానికి డీకే అరుణమ్మ, నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణిక రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
ఏనుముల తిరుపతి రెడ్డి హాజరు కానున్నారు.