ప్రజా సమస్యల కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా వాణి రేపటి సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గ్రూప్ 3 పరీక్షలు నిర్వహిస్తున్నందున సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.