ఘనంగా సైన్స్ డే ఉత్సవాల సంబరాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సేయింట్ పీటర్స్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాలైన సైన్స్ నమూనా ప్రయోగాలను ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇందులో సుమారు వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యత మీద వ్యాసరచన నిర్వహించడం జరిగింది. మరో 70 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జోసెఫ్ గారు మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ ఎంతో ముఖ్యమని విద్యార్థుల ముఖ్య భూ మిక పోషించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లో పాఠశాల ప్రిన్సిపాల్ బిజీనా మేడం , సైన్స్ టీచర్స్ రాజేష్, భూపాల్, సుష్మ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్