సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయవద్దు

సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనగామ సిఐ దామోదర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు వీడియోలు, పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయవద్దన్నారు.
తప్పుడు ప్రచారాలు చేసే వారిపై జనగామ పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్