ప్రజావాణిలో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.