ఏటూరునాగారం మండలం దొడ్ల- మల్యాల మధ్య జంపన్నవాగు తగ్గుముఖం పట్టింది. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజు కాలనీ గ్రామాల ప్రజలు వాగుదాటి తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. సుమారు 2 నెలలుగా ఆయా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయారు. కాగా వాగు తగ్గడంతో నిత్యావసరాలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.