ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరిపడా బెడ్లను ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరిండెంట్ జగదీశ్వర్ తెలిపారు. వైద్య సేవల కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో బెడ్ల కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రోగుల వెంట వచ్చే కుటుంబ సభ్యులు బెడ్లపై సేద తీరుతున్నారన్నారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.