ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ మైక్రోబీఎల్ రెసిస్టెన్స్ గురించి బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యాధికారి మహేందర్ మాట్లాడుతూ గర్భిణీలు యాంటీ బయాటిక్స్ తీసుకునే ముందు తప్పకుండా వైద్యుల సలహాలు పాటించాలన్నారు. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కు టాబ్లెట్స్ వాడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి గ్యానస, హెల్త్ సూపర్వైజర్స్ వెంకటరమణ, కోటి రెడ్డి తదితరులున్నారు.