వాజేడు: రెండు సార్లు ఆపినా చంపేశారు

వాజేడు మండలంలో గురువారం రాత్రి హత్యకు గురైన మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య రోదన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. మృతుడి భార్య మాట్లాడుతూ రాత్రి ఇద్దరం కలిసి అన్నం తిన్నామని, తన భర్త ముందే నిద్రపోయాడని తెలిపింది. రాత్రి 11 గంటలకు ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేస్తుండగా నిద్ర నుంచి మేల్కొని ఆపే ప్రయత్నం చేశానని పేర్కొంది. రెండుసార్లు గొడ్డలిని ఆపినా, మళ్లీ దాడి చేశారని, తన అత్తయ్యను పిలిచేసరికి పారిపోయారని తెలిపింది.

సంబంధిత పోస్ట్