నర్సంపేట: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నర్సంపేటలోని 22వ వార్డులో రూ. 1.60 కోట్లతో చేపట్టే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 4.50 కోట్లతో పట్టణంలోని వీధుల్లో పనులు చేయనున్నట్లు తెలిపారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్